ఇది నా భారత దేశం ఇది నా భావ నివేశం

ధర్మ క్షేత్రం కర్మ క్షేత్రం నవ నవోన్నతం భావి భరితం
ప్రవిమలం నా దేశోన్నత్యం వెల్లివిరిసెను విశ్వ ఖ్యాతమై

వేద వ్యాసులు ఆది శంకరులు వెదజల్లిరి భువి వేదామృతమును
పాదు కొలిపిరి పృధ్వీ తలమున స్వాదు భరితమౌ మాతు చరితము

హిమాలయం నా భావ నిలయం ఊహలు ఉరికే మహాలయం
నీరై కరిగెడు నీహారం హైందవ జీవన మధు కాసారం

నేను విధాతను నేనచ్యుతుడను నేను రుద్రుడను నే హైందవుడను
నే నీ పుత్రుడ తల్లివి నీవే నీ వైభవమే జీవన గమ్యం

English Transliteration

idi naa bhaarata dESam idi naa bhaava nivESam

dharma kshEtram karma kshEtram nava navOnnatam bhaavi bharitam
pravimalam naa dESOnnatyam vellivirisenu viSwa Khyaatamai

vEda vyaasulu aadi Samkarulu vedajalliri bhuvi vEdaamRtamunu
paadu kolipiri pRdhvI talamuna svaadu bharitamou maatu caritamu

himaalayam naa bhaava nilayam Uhalu urikE mahaalayam
nIrai karigeDu nIhaaram haimdava jIvana madhu kaasaaram

nEnu vidhaatanu nEnachyutuDanu nEnu rudruDanu nE haimdavuDanu
nE nI putruDa tallivi nIvE nI vaibhavamE jIvana gamyam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *