Kalpataruvu bharatabhUmi – కల్పతరువు భరతభూమి

0

కల్పతరువు భరతభూమి ఘనత నీవు పాదరా
కర్తవ్యము నెరుగుటకై భరత చరిత చూడరా

మధుర మధుర రాగములకు మంజుల తర నాదములకు
మనసు మనసు కలియుటకు మమత తీరు తెలియుటకు

అణువణువూ నీ రక్తము విమల భావ సంసిక్తము
అడుగడుగున నీ గమనము శౌర్య దీప్తి సంగమనము

వీరసుతుల వెలయించి నీతిమతుల కని పెంచిన
గత చరిత్ర మరువకురా గమ్యము విదనాడకురా

నీ హృదయమె వీణియగా నీ తలపులు తీగెలుగా
దేశభక్తి పల్లవిగా దివ్య గాన మొనరింపగ

kalpataruvu bharatabhUmi ghanata nIvu paadaraa
kartavyamu neruguTakai bharata carita chUDaraa

madhura madhura raagamulaku mamjula tara naadamulaku
manasu manasu kaliyuTaku mamata tIru teliyuTaku

aNuvaNuvU nI raktamu vimala bhaava samsiktamu
aDugaDuguna nI gamanamu Sourya dIpti samgamanamu

vIrasutula velayimci nItimatula kani pemcina
gata caritra maruvakuraa gamyamu vidanaaDakuraa

nI hRdayame vINiyagaa nI talapulu tIgelugaa
dESabhakti pallavigaa divya gaana monarimpaga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *