Maadenoy Hindustan
మాదేనోయ్ హిందుస్తాన్ మాదే మాదే మాదేనోయ్
ఢమ ఢమ ఢమ ఢమ ఢక్కనగారాల్ దిక్కు పిక్కటిల మ్రోగిస్తాం
గణగణ గణగణ ఘంటారావం ఘన గర్జనగా వినిపిస్తాం
రెప రెప రెప రెప రిక్కల తాకగ విజయ పతాకాన్నెగరేస్తాం
నింగిదాటి శృంగాల నిలచి మన దేశ గౌరవం ఘోషిస్తాం
చలువల వీడూ కొండలఱేడూ హిమవంతుండు మావాడే
త్రిభువన పావని దివ్య సువాహిని మాయమ్మే గంగామాయీ
తరగల నురగల మెరుగులు వెట్టెడు హిందు సంద్రమూ మాదేనోయ్
ధాటి మేటి జిత శతృ కోటియౌ ధనుష్కోటియది మాయదియే
నవ విచిత్ర రమణీయ నందనము కాశ్మీరము మా యుపవనమే
కొండల గుట్టల నాగుల యోగుల పూర్వ ప్రాంతమది మా యిరవే
గంగా సింధూ గౌతమి కృష్ణల పయోవర్ధితం మా నెలవే
అతి మనోజ్ఞ శిల్పాలకాలయం దక్షిణ ప్రాంతం మాదేనోయ్
దేశ గౌరవము దేశ సంపదా తేజరిల్లగా పనిచేస్తాం
బ్రహ్మ తేజమూ క్షాత్ర వీర్యమూ భారత జాతిని నింపేస్తాం
అలసట భీరుత లలవడనీయక జాతిని జాగృతి నింపేస్తాం
పురాగౌరవం నవోత్తేజమూ పరంవైభవం సాధిస్తాం
English Transliteration
maadEnOy himdustaan maadE maadE maadEnOy
Dhama Dhama Dhama Dhama Dhakkanagaaraal dikku pikkaTila mrOgistaam
gaNagaNa gaNagaNa ghamTaaraavam ghana garjanagaa vinipistaam
repa repa repa repa rikkala taakaga vijaya pataakaannegarEstaam
nimgidaaTi SRmgaala nilaci mana dESa gouravam ghOshistaam
caluvala vIDU komDala~rEDU himavamtumDu maavaaDE
tribhuvana paavani divya suvaahini maayammE gamgaamaayI
taragala nuragala merugulu veTTeDu himdu samdramU maadEnOy
dhaaTi mETi jita SatR kOTiyou dhanushkOTiyadi maayadiyE
nava vicitra ramaNIya namdanamu kaaSmIramu maa yupavanamE
komDala guTTala naagula yOgula pUrva praamtamadi maa yiravE
gamgaa simdhU goutami kRShNala payOvardhitam maa nelavE
ati manOj~na Silpaalakaalayam dakshiNa praamtam maadEnOy
dESa gouravamu dESa sampadaa tEjarillagaa panicEstaam
brahma tEjamU kshaatra vIryamU bhaarata jaatini nimpEstaam
alasaTa bhIruta lalavaDanIyaka jaatini jAgRti nimpEstaam
puraagouravam navOttEjamU paramvaibhavam saadhistaam