మనదేనోయ్ భారత దేశం భారత దేశం మనదేనోయ్
దిక్కులన్నియు పిక్కటిలాగా భారతమాతకు జై అనవోయ్

రాముని గన్న భారతి నీది సీతను గన్న పవిత్ర భూమి
ఆంజనేయుడూ లక్ష్మణ భరతులు ఆదర్శమ్ములు నీకురా
ఆచంద్రార్కం ఆదర్శంబది రామాయణమని చాటాలోయ్
రఘురాముని చరితం నాదనవోయ్

ధర్మరాజునూ కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి
వేనవేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కల్గిన భారతి
ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్
ఆ మహాభారతం నాదనవోయ్

యవనుల తరిమిన చంద్రగుప్తుడు మొగలుల గెల్చిన వీర శివాజీ
పుష్యమిత్రుడూ తాంత్యాతోపే రుద్రమ దేవీ ఝాన్సీ రాణులు
సువర్ణపుటలతొ చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్
వారంతా నావారనవోయ్

ఆదిశంకరుని శంఖారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం
సమర్ధరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది
ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణీ నాదనవోయ్
ఆ వివేక వాణీ నాదనవోయ్

English Transliteration

manadEnOy bhaarata dESam bhaarata dESam manadEnOy
dikkulanniyu pikkaTilaagaa bhaaratamaataku jai anavOy

raamuni ganna bhaarati nIdi sItanu ganna pavitra bhUmi
AmjanEyuDU lakshmaNa bharatulu aadarSammulu nIkuraa
aacamdraarkam aadarSambadi raamaayaNamani caaTaalOy
raghuraamuni caritam naadanavOy

dharmaraajunU kanna bhaarati bhagavadgItanu iccina bhaarati
vEnavElugaa dharma sUkshmamulu bhaaratamamduna kalgina bhaarati
prapamcamunakE nIti nErpagala pamcama vEdam naadanavOy
aa mahaabhaaratam naadanavOy

yavanula tarimina camdraguptuDu mogalula gelcina vIra SivaajI
puShyamitruDU taamtyaatOpE rudrama dEvI JhaansI raaNulu
suvarNapuTalato caritra nimpina bhaarati biDDalu vaaranavOy
vaaramtaa naavaaranavOy

aadiSamkaruni Samkhaaraavam agastyamouni dharma pracaaram
samardharaamuDu paramahamsalaku janmaniccina puNyabhUmidi
prapamca sabhalO garjana cEsina bhaaratavANI naadanavOy
aa vivEka vaaNI naadanavOy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *