Saha Jeevaname Santi Ki Nelavani

0

సహజీవనమే శాంతికి నెలవని
అంటరానితనమమానుషమ్మని
వివిధత్వములో ఏకత్వములే
సాధించినది హిందు జీవనం

మార్గమేదైన గమ్యమొకటని
జీవులలో పరమాత్మ యున్నదని
సర్వ పంథ సమ భావనమ్ములో
విశ్వ హితముకై పరితపించినది

వేదవ్యాసుడు ఋషి వాల్మీకి
శబరి అరుంధతి అంబేద్కరులను
సామాజిక సమరసాస్వాదనతో
సమాదరించిన సమాజమ్మిది

హిందువు ఎన్నడు పతితుడు కాడని
ఘోషించెను మన ధర్మ శాస్త్రములు
వర్ణ వర్గ మత జాతి భేదముల
అసమానతలను అంతము చేయగ

సమతను పెంచి మమతను పంచి
సమరసతను అణువణువున నింపి
సంఘటనముతో సౌశీల్యముతో
జాతి గంగలో జాగృతి నింపగ

English Transliteration

sahajIvanamE Saamtiki nelavani
amTaraanitanamamaanuShammani
vividhatvamulO EkatvamulE
saadhimcinadi himdu jIvanam

maargamEdaina gamyamokaTani
jIvulalO paramaatma yunnadani
sarva pamtha sama bhaavanammulO
viSva hitamukai paritapimcinadi

vEdavyaasuDu Rshi vaalmIki
Sabari arumdhati ambEdkarulanu
saamaajika samarasaasvaadanatO
samaadarimcina samaajammidi

himduvu ennaDu patituDu kaaDani
GhOShimcenu mana dharma Saastramulu
varNa varga mata jaati bhEdamula
asamaanatalanu amtamu cEyaga

samatanu pemci mamatanu pamci
samarasatanu aNuvaNuvuna nimpi
samGhaTanamutO souSIlyamutO
jaati gamgalO jaagRti nimpaga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *