Hinduvuga Janminchuta ila lo
హిందువుగా జన్మించుట ఇలలో మహా భాగ్యమని మరువకురా
హిందువులే ఈ గడ్దను పుట్టిన ముద్దుబిడ్దలని చాటుమురా
దారులనేకం దేవుడొక్కడని చాటిచెప్పినది హిందువురా
ఘోర పాపములు చేసిన క్రూరుల మదమణంచినది హిందువురా
కారు చీకటుల బాపి జగానికి దారి చూపినది హిందువురా
భారమనక శరణార్ధి జాతులకు నీడనొసగినది హిందువురా
రావణాది రాకాసి మూకలను సం హరించినది ఎవరోయీ
దండిగ వచ్చిన శత్రు మూకలను తిప్పికొట్టినది ఎవరోయీ
గ్రీకు, హూణ, శక, కుషాణాదులను మ్రింగి వైచినది ఎవరోయీ
ఆది అంతములు లేని చరిత్రకు నిజమగు వారసులెవరోయీ
ఇజాల పేరుతో నిజానిజాలను గాలికి వదిలితె అధోగతీ
జంకక గొంకక ధర్మము తప్పక సత్యమాడితే పురోగతీ
స్వాభిమానమూ స్వీయచరిత్రలు మరచినవారికి అధోగతీ
పూజ్య కేశవుడు చూపిన మార్గము అనుసరించినచో పురోగతీ
English Transliteration
himduvugaa janmimcuTa ilalO mahaa bhaagyamani maruvakuraa
himduvulE I gaDdanu puTTina muddubiDdalani caaTumuraa
daarulanEkam dEvuDokkaDani caaTiceppinadi himduvuraa
ghOra paapamulu cEsina krUrula madamaNamcinadi himduvuraa
kaaru cIkaTula baapi jagaaniki daari cUpinadi himduvuraa
bhaaramanaka SaraNaardhi jaatulaku nIDanosaginadi himduvuraa
raavaNaadi raakaasi mUkalanu sam harimcinadi evarOyI
damDiga vaccina Satru mUkalanu tippikoTTinadi evarOyI
grIku, hUNa, Saka, kuShaaNaadulanu mrimgi vaicinadi evarOyI
aadi amtamulu lEni caritraku nijamagu vaarasulevarOyI
ijaala pErutO nijaanijaalanu gaaliki vadilite adhOgatI
jamkaka gomkaka dharmamu tappaka satyamaaDitE purOgatI
svaabhimaanamU svIyacaritralu maracinavaariki adhOgatI
pUjya kESavuDu cUpina maargamu anusarimcinacO purOgatI