nava bhagIratha kESavunaku – నవ భగీరథ కేశవునకు
నవ భగీరథ కేశవునకు శతజయంతి నీరాజనం శతజయంతి నీరాజనం
చిన్ననాటనె మాతృ సేవలో స్వీకరించెను ప్రతిన యొక్కటి
తెల్లవారల తరిమివేయగ కృషినొనర్చెను పలు తెరంగుల
ఆత్మ విస్తృతి నుండి జాతిని మేలుకొల్పుటె కీలకమ్మని
అసలు మార్గము తెలుసుకొని స్థాపించె మనకై సంఘమొక్కటి
పూలమాలకు గళము చాచకు యశోగీతుల ఊసు మానుము
పత్రికలలో పేరుపడునను స్వార్ధ చింతన చేరనీయకు
సహజమగు కర్తవ్యమిదియని స్వయంస్ఫూర్తితో కదలి రమ్మని
మాతృ సేవకు పిలుపు నిచ్చెను కలసి నడచుట మనకు నేర్పెను
పార్ధివంబగు దేహమేమో పంచభూతములందు కలిసెను
జీవితమ్మున వివిధ ఘటనల దివ్యదీపపు కాంతినిచ్చెను
హిందువుల సంఘటనమే మన అన్ని ప్రశ్నల సమాధానం
పూర్ణముగ విశ్వాసముంచి ముందు ముందుకు సాగిపోదము
nava bhagIratha kESavunaku Satajayamti nIraajanam Satajayamti nIraajanam
cinnanaaTane maatR sEvalO svIkarimchenu pratina yokkaTi
tellavaarala tarimivEyaga kRshinonarchenu palu teramgula
aatma vistRti numDi jaatini mElukolpuTe kIlakammani
asalu maargamu telusukoni sthaapimche manakai samghamokkaTi
pUlamaalaku gaLamu chaachaku yaSOgItula Usu maanumu
patrikalalO pErupaDunanu svaardha cimtana chEranIyaku
sahajamagu kartavyamidiyani svayamsphUrtitO kadali rammani
maatR sEvaku pilupu nichchenu kalasi naDachuTa manaku nErpenu
paardhivambagu dEhamEmO pamchabhUtamulamdu kalisenu
jIvitammuna vividha GhaTanala divyadIpapu kaamtinichchenu
himduvula samghaTanamE mana anni praSnala samaadhaanam
pUrNamuga viSvaasamumchi mumdu mumduku saagipOdamu