Sadhu Sujana Toshini
సాధు సుజన తోషిణీ సకల శత్రు శోషిణీ
శరణాగత ధరణీతల జన గణ పరిపోషిణీ
వికసిత విజ్ఞాన శాస్త్ర విపుల కీర్తి ధారిణీ
విలసిత పరమార్ధ తత్వ విమల సార రూపిణీ
సకలజీవ హితరత మహితాశయ సంశోభినీ
ఆది ధరణి వేద జనని ముని జన సమ్మానినీ
నీ గళ నిశ్రుతమై భువి ప్రసరించె సరస్వతీ
నీ హృదయ వినిర్గతమై ప్రభవించె సుసంస్కృతి
జడ మూఢ జనాళి కెల్ల జాగృతి సంధాయినీ
విజ్ఞానద విభవప్రద విశ్వధాత్రి గుణఖనీ
దశ విధ శస్త్రాస్త్ర హస్త దనుజజన భయంకరీ
అభయ వరద ముద్రాంకిత ఆర్య జన శివంకరీ
లోచన యుగళాంత అరుణ కరుణరాగ రంజితా
జయమాతా, జయ భారతి, జయ జయ అపరాజితా
English Transliteration:
saadhu sujana tOshiNI sakala Satru SOshiNI
SaraNaagata dharaNItala jana gaNa paripOshiNI
vikasita vijnaana Saastra vipula kIrti dhaariNI
vilasita paramaardha tatva vimala saara rUpiNI
sakalajIva hitarata mahitaaSaya samSObhinI
aadi dharaNi vEda janani muni jana sammaaninI
nI gaLa niSrutamai bhuvi prasarimce sarasvatI
nI hRdaya vinirgatamai prabhavimce susamskRti
jaDa mUDha janaaLi kella jaagRti samdhaayinI
vijnaanada vibhavaprada viSvadhaatri guNakhanI
daSa vidha Sastraastra hasta danujajana bhayamkarI
abhaya varada mudraamkita aarya jana SivamkarI
lOcana yugaLaamta aruNa karuNaraaga ramjitaa
jayamaataa, jaya bhaarati, jaya jaya aparaajitaa