Asetu Seeta nagamu (Meru dheera Guruji)

0

ఆ సేతు శీతనగము అంజలించె మాధవజీ
అందుకొనుము శ్రధ్ధాంజలి మేరు ధీర గురూజీ

అఖండ భరత ధాత్రి కొరకు అహరహము తపించినావు
రాష్ట్ర పురుష సేవలోన ప్రాణములర్పించినావు
ఒక మారా? ఒక ఏడా? పావన భారత ధాత్రిని
ధూమ శకటమే గృహముగ నియమముతో తిరిగినావు

మానవులను శ్రేష్ఠులుగా మలచిన మహనీయ శిల్పి
కేశవుడే గురుతించిన ఆశాకిరణము నీవె
కర్మ వీరవ్రతము నీది ధర్మ దీక్ష తపము నీది
ధ్యేయ మార్గమై నిలచిన మాయా మానుష రూపా

నీ నడిచిన మార్గములో జనతను నడిపించినావు
సంఘశక్తి నీ జాతికి వరముగ చూపించినావు
నీవు పలుకు ప్రతి మాటలో నిండియుండు నీ తపస్సు
నీ జీవితమొక యజ్ఞము నీ చూపే ఒక లోకము

English Transliteration

A sEtu SItanagamu amjalimce maadhavajI
amdukonumu Sradhdhaamjali mEru dheera gurUjI

akhamDa bharata dhaatri koraku aharahamu tapimcinaavu
raashTra purusha sEvalOna praaNamularpimcinaavu
oka maaraa? oka EDA? paavana bhaarata dhaatrini
dhUma SakaTamE gRhamuga niyamamutO tiriginaavu

maanavulanu SrEshThulugaa malacina mahanIya Silpi
kESavuDE gurutimcina ASaakiraNamu neeve
karma vIravratamu nIdi dharma dIksha tapamu nIdi
dhyEya maargamai nilacina maayaa maanusha rUpaa

nI naDicina maargamulO janatanu naDipimcinaavu
samghaSakti nI jaatiki varamuga cUpimcinaavu
nIvu paluku prati maaTalO nimDiyumDu nI tapassu
nI jIvitamoka yaj~namu nI cUpE oka lOkamu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *