damDaalu damDaalu – దండాలు దండాలు

0

దండాలు దండాలు మా తల్లి భారతీ
శతకోటి దండాలు మా తల్లి భారతీ
ఈ భూమి బిడ్డలం మా తల్లి భారతీ
హిందువులమందరం మా తల్లి భారతీ

శ్రీ రాముని గన్నట్టి మా తల్లి భారతీ
శ్రీ కృష్ణుని గన్నట్టి మా తల్లి భారతీ
వీరవరుల గన్నట్టి మా తల్లి భారతీ
పరమ ఋషుల గన్నట్టి మా తల్లి భారతీ

హిమాలయం కిరీటమే మా తల్లి భారతీ
హిందు సంద్రం పాదపీఠి మా తల్లి భారతీ
భౌతికంగ సంపదలున్న మా తల్లి భారతీ
భావ వైభవములున్న మా తల్లి భారతీ

వీరవరుల గన్నట్టి మా తల్లి భారతీ
వీరత్వం బోధించు మాతల్లి భారతీ
జగద్గురువు గన్నట్టి మా తల్లి భారతీ
జగత్తునే వెలిగించు మా తల్లి భారతీ

damDaalu damDaalu maatalli BhaaratI
SatakOTi damDaalu maa talli bhaaratI
I bhUmi biDDalam maa talli bhaaratI
himduvulamamdaram maa talli BhaaratI

SrI raamuni gannaTTi maa talli bhaaratI
SrI kRshNuni gannaTTi maa talli bhaaratI
vIravarula gannaTTi maa talli BhaaratI
parama Rshula gannaTTi maa talli BhaaratI

himaalayam kirITamE maa talli BhaaratI
himdu samdram paadapIThi maa talli BhaaratI
bhoutikamga sampadalunna maa talli bhaaratI
bhaava vaibhavamulunna maa talli BhaaratI

vIravarula gannaTTi maa talli BhaaratI
vIratvam bOdhimcu maatalli BhaaratI
jagadguruvu gannaTTi maa talli BhaaratI
jagattunE veligimcu maa talli BhaaratI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *