himdu bhUmi idi mana dESam – హిందు భూమి ఇది మన దేశం
హిందు భూమి ఇది మన దేశం వందనీయమిది మన ధర్మం
గౌరీశంకర గిరిపై నెగురును గురువగు అరుణధ్వజం
రామకృష్ణుల భూమి ఇదే ఋషి ముని జనముల భూమి ఇదే
అవతారాలకు స్థానమిదేగా అవనికి మోక్ష ద్వారమిదేగా
మంగళప్రదమై మహిలో వెలిగే మాతృభూమి ఇదియే
వ్యక్తి వ్యక్తినీ సమీకరించీ శక్తి తత్వమును ఆరాధించీ
గత వైభవమును జ్ఞప్తికి తెచ్చీ ఆత్మ విస్మృతిని అంతం చేసీ
నరనరములలో నవనాడులలో జాగృతి నింపేద్దాం
కంటకమయమీ మార్గంబైనా కర్మ వీరులుగ పనిచేద్దాం
అరివర్గాలను అంతంచేసీ ధరణిలొ విజయం సాధిద్దాం
భువిపై హైందవ జాతి ప్రతిష్టను సుస్థిరమొనరిద్దాం
సమాజ శ్రేయమె మన ధ్యేయం ఆత్మ సమర్పణ మన మార్గం
నిద్రాహారాల్లేకున్నా నీరధి మనపై పడనున్నా
పదం పదంతో మిళితం చేసీ కదనం సాగిద్దాం
himdu bhUmi idi mana dESam vamdanIyamidi mana dharmam
gourISamkara giripai negurunu guruvagu aruNadhvajam
raamakRshNula bhUmi idE Rshi muni janamula bhUmi idE
avataaraalaku sthaanamidEgaa avaniki mOksha dvaaramidEgaa
mamgaLapradamai mahilO veligE maatRbhUmi idiyE
vyakti vyaktinI samIkarimcI Sakti tatvamunu aaraadhimcI
gata vaibhavamunu j~naptiki teccI aatma vismRtini amtam cEsI
naranaramulalO navanaaDulalO jaagRti nimpEddaam
kamTakamayamI maargambainaa karma vIruluga panicEddaam
arivargaalanu amtamcEsI dharaNilo vijayam saadhiddaam
bhuvipai haimdava jaati pratishTanu susthiramonariddaam
samaaja SrEyame mana dhyEyam aatma samarpaNa mana maargam
nidraahaaraallEkunnaa nIradhi manapai paDanunnaa
padam padamtO miLitam cEsI kadanam saagiddaam