Jayamagu gaataa – జయమగు గాతా

0

జయమగు గాతా భారతమాతా అతులిత బల సముపేతా
అభయ ప్రదాతా జగ విఖ్యాతా అగణిత గుణ సమవేతా

మా ఊహలు మా ఉఛ్వాసాలూ మా భావాలూ గానాలూ
నీకేనమ్మా అంకితమూ మా సర్వస్వం నీవేనమ్మా

ఈ జీవితమూ నీవేనమ్మా నీవు లేక ఇది మోడేనమ్మా
సుందర సురభిళ కుసుమము చేసీ అర్చింతుము నీ పదములనమ్మా

నీ సంతానపు సంక్షేమానికి నిరతము తానే నీరాజనమై
కరగిపోవు ఆ భవ్య జీవనమె ధన్యము ధన్యము ధన్యము తల్లీ

jayamagu gaataa bhaaratamaataa atulita bala samupEtaa
abhaya pradaataa jaga viKhyaataa agaNita guNa samavEtaa

maa Uhalu maa uChvaasaalU maa bhaavaalU gaanaalU
nIkEnammaa amkitamU maa sarvasvam neevEnammaa

I jIvitamU nIvEnammaa nIvu lEka idi mODEnammaa
sumdara surabhiLa kusumamu cEsI arcimtumu nI padamulanammaa

nI samtaanapu samkshEmaaniki niratamu taanE nIraajanamai
karagipOvu aa bhavya jIvaname dhanyamu dhanyamu dhanyamu tallI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *