jayamu jayamu bharatamaata – జయము జయము భరతమాత

0

జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత
ఈ జగాన సాటి ఎవ్వరే ఓ యమ్మ నీకు

గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా
పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు
జీవనదుల కన్నతల్లివే ఓయమ్మ నీవు

హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు
దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు
పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు
నిజముగ నువు రత్న గర్భవే ఓయమ్మ నీవు

లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు
నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు
వేదాలను వెలికితెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు
నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు

jayamu jayamu bharatamaata jayamu nIku jaganmaata
I jagaana saaaTi evvarE O yamma nIku

gamga yamuna gOdaarI simdhu kRshNa kaavErI
brahmaputra tumgabhadra tapatI narmada pennaa
pomgi porale taramgaalu nI meDalO haaraalu
jIvanadula kannatallivE Oyamma nIvu

hima vimdhyaa parvataalu dEvatalaku nilayaalu
daTTamaina araNyaalu mahaamunula sthaavaraalu
pasiDi pamTa kshEtraalu pamcalOha Khanijaalu
nijamuga nuvu ratna garbhavE Oyamma nIvu

lOkamamta cIkaTilO tallaDillutunnappuDu
naagarikata lEka narulu paamarulai unnappuDu
vEdaalanu velikitechchi j~naanabhiksha peTTinaavu
nijamuga nuvu jagadguruvuvE Oyamma nIvu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *