Yetuloohinchitivayya Vijayamu

0

ఎటులూహించితివయ్యా విజయము ఏ విధి గాంచితివయ్యా

వేయి యేండ్లుగా విఘటన కెరయై తుంటరి మూకల దాడికి గురియై
ఒంటరి బ్రతుకై ఓటమి పాలై విరిగిన పాలగు వీర హిందువుల
సమైక్య జీవన సమాజ భావన

ఎన్ని ప్రాంతములో ఎన్ని భాషలో ఎన్ని కులాలో అన్ని ముఠాలై
కుక్కలు చింపిన విస్తరి బ్రతుకై క్రుంగిన హిందువులందరి యందున
సమరస భావము సంఘటనమ్ముల

పసిబాలురతో ప్రారంభించి ప్రౌఢుల కూడా అనుసంధించి
ఆటపాటలే కార్యక్రమముగ అనంత హైందవ యువ సమాజమును
అనుశాసనమును ఆత్మీయతలను

స్వార్ధ రహితులై సౌశీల్యముతో ప్రతి ప్రాంతములో ప్రతి నగరమ్మున
కదం త్రొక్కుతూ పదం పాడుతూ భారతమాతకు జై జై యంటూ
బలోపాసనము హిందువులందున

English transliteration

eTulUhimcitivayyaa vijayamu E vidhi gaamcitivayyaa

vEyi yEmDlugaa vighaTana kerayai tumTari mUkala daaDiki guriyai
omTari bratukai OTami paalai virigina paalagu vIra himduvula
samaikya jIvana samaaja bhaavana

enni praamtamulO enni bhaashalO enni kulaalO anni muThAlai
kukkalu cimpina vistari bratukai krumgina himduvulamdari yamduna
samarasa bhaavamu samGhaTanammula

pasibaaluratO praarambhimci prouDhula kUDaa anusamdhimci
ATapaaTalE kaaryakramamuga anamta haimdava yuva samaajamunu
anuSaasanamunu aatmIyatalanu

svaardha rahitulai souSIlyamutO prati praamtamulO prati nagarammuna
kadam trokkutU padam paaDutU bhaaratamaataku jai jai yamTU
balOpaasanamu himduvulamduna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *