yugayugaala snEhabamdhamidi – యుగయుగాల స్నేహబంధమిది

0

యుగయుగాల స్నేహబంధమిది రక్షాబంధన్
కలిమి లేమిలో కష్ట సుఖములో

నీవే నేనుగ నేనే నీవుగ కలిసి చరించే జ్ఞానమిచ్చెడి
ప్రేరక బంధనమిది రక్షా బంధన్

విడివిడిగా పడిపోయిన మణులను వివిధరూప మాలలలో చేరిచి
విలువతెచ్చి శక్తిని కూర్చే సమైక్యతా బంధనమిది రక్షా బంధన్

వ్యక్తిత్వపు అహమేమియు లేక ముక్తిని గూర్చే దివ్యమార్గమున
కోటిచరణ ముద్రాకింత పథమున అవధిని చూపే మధుబంధనమిది రక్షా బంధన్

సమాజ సింధువులో నొక బిందువై రాష్ట్రదేవ చరణ సీమలో
స్వార్పణ మొనరిచే ధర్మము నెరిగించిన బంధనమిది రక్షా బంధన్

yugayugaala snEhabamdhamidi rakshaabamdhan
kalimi lEmilO kashTa sukhamulO

nIvE nEnuga nEnE nIvuga kalisi charimchE jnaanamichcheDi
prEraka bamdhanamidi rakshaa bamdhan

viDiviDigaa paDipOyina maNulanu vividharUpa maalalalO chErichi
viluvatechchi Saktini kUrchE samaikyataa bamdhanamidi rakshaa bamdhan

vyaktitvapu ahamEmiyu lEka muktini gUrcE divyamaargamuna
kOTicaraNa mudraakimta pathamuna avadhini cUpE madhubamdhanamidi rakshaa bamdhan

samaaja simdhuvulO noka bimduvai raashTradEva charaNa sImalO
svaarpaNa monarichE dharmamu nerigimchina bamdhanamidi rakshaa bamdhan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *