బ్రతుకు సుఖమయ్యేనురా
ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలసి మెలసుంటుంటే
బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్ని పండేనురా

ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ వడి లో బిడ్డలాటాడుకొన్నట్లు
ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే

కులము ఏదైనాను కోరేది మోక్షమే కులముకై మనకేల కాకి మూకల గోల
బ్రతికున్న మూణ్ణాళ్ళు పదిమంది బంధువై కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే

శృతిలేని పాటలా మతిలేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా
నీటి చుక్కల్లాగ కాటి పువ్వుల్లాగ నశియించి పోతున్న నలుగురితొ కలిసుంటే

English Transliteration:
bratuku sukhamayyEnuraa
I bhUmi biDDalam himduvulamamdaram kashTa sukhamulalOna kalasi melasumTumTE
bratuku sukhamayyEnuraa bamgaaru kalalanni pamDEnuraa

unnODu lEnODu anna tEDA lEka amma vaDi lO biDDalaaTaaDukonnaTlu
oka tIga puvvulai oka paaTa maaTalai kashTa sukhamulalOna kalasimelasumTumTE

kulamu Edainaanu kOrEdi mOkshamE kulamukai manakEla kaaki mUkala gOla
bratikunna mUNNaaLLu padimamdi bamdhuvai kashTa sukhamulalOna kalasimelasumTumTE

SRtilEni paaTalaa matilEni maaTalaa emta gomtettitE Emi laabhammuraa
nITi cukkallaaga kaaTi puvvullaaga naSiyimci pOtunna nalugurito kalisumTE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *