haindavEyula keerti – హైందవేయుల కీర్తి

0

హైందవేయుల కీర్తి చంద్రికలన్ని దిక్కుల నలమి పులుమగ
కందలించెడి మానసంబున కదలి రావోయి తమ్ముడా, కదలి రావోయి తమ్ముడా

రాజదండము యోగదండములను ధరించు వశిష్ట మౌనియు
కూలిపోయిన పూర్వనీతిని మేలుకొలిపిన బుధ్ధ దేవుడు
సత్యశక్తి స్వరూపనిధియౌ స్వామి విద్యారణ్య మౌనియు
జయముకలుగనాశీర్వదించెడి సాధుమూర్తులు తమ్ముడా

రాజపుత్రుల ప్రధిత తేజము రగులజేయు ప్రతాప సిమ్హుడు
జాతిశౌర్యము చిందజేసిన సాహసాంక శివాజి భూపతి
తెలి వెలుంగుల నొలకబోసిన తెలుగు కులపతి కృష్ణ రాయలు
మహితవర్తనులగ్రగాములు మార్గదర్శులు తమ్ముడా
మార్గదర్శులు తమ్ముడా

యుగయుగంబుల శౌర్యగాథల జిగి వెలుంగుల రగులు హిమగిరి
చేవదేలెడి ఆత్మశక్తికి చిహ్నమై వెలుగొందు వింధ్యయు
చలువలలమిన భరత మాతకు నెలవులే మలయాచలంబులు
సమర సాహస శక్తి నిచ్చెడి శౌర్య రాసులు తమ్ముడా
శౌర్యరాసులు తమ్ముడా

నింగి పొంగి తరంగలించెడి మంగళాలయ గాంగజలములు
రామ విభు నీరాజనంబున సేమముల చిలికించు గౌతమి
ధీరయోధ కవోష్ణ రక్తపు తృష్ణ దీరిన కృష్ణ తీరము
నిర్మలంబగు శౌర్యవాహిని నింపు నిధులవి తమ్ముడా
నింపు నిధులవి తమ్ముడా

haindavEyula keerti chamdrikalanni dikkula nalami pulumaga
kamdalimcheDi maanasambuna kadali rAvOyi tammuDaa, kadali raavOyi tammuDaa

raajadamDamu yOgadmDamulanu dharimcu vaSishTa mouniyu
kUlipOyina pUrvanItini mElukolipina budhdha dEvuDu
satyaSakti svarUpanidhiyou svaami vidyaaraNya mouniyu
jayamukaluganaaSIrvadimcheDi saadhumUrtulu tammuDaa

raajaputrula pradhita tEjamu ragulajEyu prataapa simhuDu
jaatiSouryamu cimdajEsina saahasaamka Sivaaji bhUpati
teli velumgula nolakabOsina telugu kulapati kRshNa raayalu
mahitavartanulagragaamulu maargadarSulu tammuDaa
maargadarSulu tammuDaa

yugayugambula Souryagaathala jigi velumgula ragulu himagiri
cEvadEleDi aatmaSaktiki cihnamai velugomdu vimdhyayu
caluvalalamina bharata maataku nelavulE malayaachalambulu
samara saahasa Sakti nichcheDi Sourya raasulu tammuDaa
Souryaraasulu tammuDaa

nimgi pomgi taramgalimcheDi mamgaLaalaya gaamgajalamulu
raama vibhu nIraajanambuna sEmamula chilikimchu goutami
dhIrayOdha kavOshNa raktapu tRshNa dIrina kRshNa tIramu
nirmalambagu Souryavaahini nimpu nidhulavi tammuDaa
nimpu nidhulavi tammuDaa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *