Jana Jagruta Navabharata Mahodayam
జన జాగృత నవభారత మహోదయం
ఈ కనులతోనే కాంచుదాం
ఈ జీవితమున సాధించుదాం ||జన||
ప్రతి హృది లో దేశ భక్తి మోసులెత్త
నర నరాన నవచేతన వెల్లివిరియ
సమతాభావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన||
మన పూర్వుల మహనీయుల స్మరియించి
మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి
అహరహము శ్రమియించి జగతిన శిరమెత్తి నిలచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన||
ప్రాంత భాష కులమతాల కలతలతో
పలురీతుల బలహీనత లావరించె
అందరమొకటిగ నిలచి తరతమ భేదాలు మరచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన||
నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చుపెరిగి
అదనుచూచి కాటువేయ చూస్తున్నవి
జనతను జాగృతపరిచి ఎదఎదలో శక్తి నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన||