maa praaNaalaku nava praaNam – మా ప్రాణాలకు నవ ప్రాణం
మా ప్రాణాలకు నవ ప్రాణం మా జీవాలకు నవజీవం
మా రాష్ట్రానికి ఉజ్జ్వల కేంద్రం అరుణారుణ భగవ పతాకం
సురసరితా కల్లోలంలో మహనీయ ప్రణవ ఘోషలో
మా భారతకీర్తికి ఏక ప్రతీకం అరుణారుణ భగవ పతాకం
రామవిభుని రథ కేతనమై రావణు చంపిన పౌరుషరూపం
నరనారాయణ సమగ్ర తేజం అరుణారుణ భగవ పతాకం
చంద్రగుప్త చాణక్యాదుల శంకర విద్యారణ్య మౌనుల
తప: పూతమగు పవిత్ర చిహ్నం అరుణారుణ భగవ పతాకం
ప్రతాపగురు శివరాజేంద్రుల కృష్ణరాయ బందారుద్రుల
త్యాగాలకు పవిత్రలక్ష్యం అరుణారుణ భగవ పతాకం
విశ్వమానవ శ్రేయస్సునకై సంఘటిత జనాభ్యున్నతికై
త్యాగసేవ భావలకు మూలం అరుణారుణ భగవ పతాకం
maa praaNaalaku nava praaNam maa jIvaalaku navajIvam
maa raashTraaniki ujjwala kEmdram aruNaaruNa bhagava pataakam
surasaritaa kallOlamlO mahanIya praNava ghOshalO
maa bhaaratakIrtiki Eka pratIkam aruNaaruNa bhagava pataakam
raamavibhuni ratha kEtanamai raavaNu campina pourusharUpam
naranaaraayaNa samagra tEjam aruNaaruNa bhagava pataakam
camdragupta chaaNakyaadula Samkara vidyaaraNya mounula
tapa: pUtamagu pavitra cihnam aruNaaruNa bhagava pataakam
prataapaguru SivaraajEmdrula kRshNaraaya bamdaarudrula
tyaagaalaku pavitralakshyam aruNaaruNa bhagava pataakam
viSvamaanava SrEyassunakai samghaTita janaabhyunnatikai
tyaagasEva bhaavalaku mUlam aruNaaruNa bhagava pataakam