పాడుదాం పాడుదాం భారతి జయ గీతం
వాడిపోని వైభవాల పావన సంగీతం

వేద శారదాంబ వేలు శృతి చేసిన వల్లకీ
సకల విశ్వ శ్రేయమె స్వర సంచారము దీనికి
పరమ పదము పదమైనది ఈ పవిత్ర గీతికి
యోగరాగమీగానం ఆగదు ఏ యుగానికి

ప్రతి పురుగు ఈ పుడమిని పలుకును ఆ ప్రణవమే
ఈ దేశపు దేహం ప్రత్యణువు ఆ గానమే
తలలూచే తరులన్నీ విరబూచే విరులన్నీ
పడిలేచే అలలన్నీ పాడును ఆ గానమే

ఈ పొలాల పంట సిరుల తరగని శ్రీ రాగం
ఈ కోనల నాగుల బుస శంకరాభరణం
ఈ చందన శీతల పవనాలలోని హిందోళం
ఈ సుందర కాననాల కళ్యాణి గమనం
ప్రళయ ప్రభంజనమిచ్చట శివరంజని గా
ప్రతి ప్రభాత భూపాళం శుభ సూచనగా

English Transliteration

paaDudaam paaDudaam bhaarati jaya gItam
vaaDipOni vaibhavaala paavana samgItam

vEda Saaradaamba vElu SRti cEsina vallakI
sakala viSva SrEyame svara samcaaramu dIniki
parama padamu padamainadi I pavitra gItiki
yOgaraagamIgaanam aagadu E yugaaniki

prati purugu I puDamini palukunu aa praNavamE
I dESapu dEham pratyaNuvu aa gaanamE
talalUcE tarulannI virabUcE virulannI
paDilEcE alalannI paaDunu aa gaanamE

I polaala pamTa sirula taragani SrI raagam
I kOnala naagula busa SamkaraabharaNam
I camdana SItala pavanaalalOni himdOLam
I sumdara kaananaala kaLyANi gamanam
praLaya prabhamjanamiccaTa Sivaramjani gaa
prati prabhaata bhUpaaLam Subha sUcanagaa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *