ప్రార్ధనా గైకొనుము తల్లీ భారతీ జయ కల్పవల్లీ

గంగ యమునా సింధు నదులూ పొంగి పొరలుచు నిండుగా
ముంగిట ప్రవహించుచున్నవి మంగళ స్నానాలు చేయగా

నీదు మహిమను నిర్మలముగా వేదములె వర్ణించెనమ్మా
బాదరాయణుడాది మౌనులు అందముగ కీర్తించిరమ్మా

చత్రపతి రాణాప్రతాపసింహ గురుగోవిందులాదిగ
క్షాత్ర తేజము చిందులేసెడి వీరవ్రతులను గన్న జననీ

English Transliteration

praardhanaa gaikonumu tallI bhaaratI jaya kalpavallI

gamga yamunaa simdhu nadulU pomgi poralucu nimDugaa
mumgiTa pravahimcucunnavi mamgaLa snaanaalu cEyagaa

nIdu mahimanu nirmalamugaa vEdamule varNimcenammaa
baadaraayaNuDaadi mounulu amdamuga kIrtimcirammaa

cHatrapati raaNaaprataapasim ha gurugOvimdulaadiga
kshaatra tEjamu cimdulEseDi vIravratulanu ganna jananI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *